Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భారీ వర్షాలు

Heavy Rains in Japan

టోక్యో : జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు వచ్చి ఆ దేశ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు వందమందికి పైగా చనిపోయారు. వీరిలో 87 మందిని గుర్తించారు. మరో 13మంది మృతుల వివరాలు తెలియరాలేదని జపాన్ ప్రభుత్వం తెలిపింది. వరదల కారణంగా నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. చాలా మంది వరదల్లో గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. గత గురువారం నుంచి జపాన్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. సైన్యం రంగంలోకి దిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడగడంతో కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. సుమారు 9మంది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. 2004 తరువాత జపాన్‌లో ఇంతటి భారీ వర్షాలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.

Heavy Rains in Japan

Comments

comments