తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. చాలా మంది గల్లంతయ్యారు. ఇడుక్కీ, మలప్పురం, కన్నూర్, వయనాడ్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇడుక్కీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబనికి 10 మంది చనిపోయారు. మలప్పురంలో ఐదుగురు, కన్నూర్‌లో ముగ్గురు, వయనాడ్‌లో ఒకరు మృతి చెందారు. పాలక్కడ్ కోజికొడె, వయనాడ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ఇడుక్కీ రిజర్వాయ్‌లో నీటిమట్టం పెరిగిపోయింది. భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.