Home జాతీయ వార్తలు ముంబయిలో భారీ వర్షాలు

ముంబయిలో భారీ వర్షాలు

Heavy Rains in Mumbai

ముంబయి : ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ముంబయి వాసులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో అంథేరి రైల్వే స్టేషన్‌లో పాదచారుల వంతెన కూలింది. ఈ వంతెన కూలిపోవడంతో పశ్చిమ రైల్యే సర్వీసులు అన్ని నిలిచిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. థానేలోని ఓ హౌసింగ్ సొసైటీ ప్రహరీ గోడ కూలి ఓ వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడణవీస్ బిఎంసి కమిషనర్, ముంబయి పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. రైల్వే సర్వీసులు నిలిచిపోయినందున ప్రజలు ఇబ్బందులు పడకుండా బస్సు సర్వీసులను పెంచాలని సిఎం వారిని ఆదేశించారు. విరార్ – గోరెగావ్, బాంద్రా – చర్చిగేట్‌ల మధ్య రైళ్లు నడుస్తున్నాయి. అవసరమైతే తప్ప రైలు ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

Heavy Rains in Mumbai