Friday, March 29, 2024

ఉత్తర తెలంగాణకు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 15జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదున్న ఆవర్తనం గురువారం వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 కి.మి ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్ , నిజామాబాద్ ,జగిత్యాల ,

రాజన్న సిరిసిల్ల , కరీంనగర్ ,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశ ం ఉన్నట్టు తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా కొటపల్లి మండలం దేవులవాడలో 56.8 మి.మి వర్షం కురిసింది.మద్దుకూరులో 56.5, కొత్తగూడెంల 54.3, కొల్లూరులో 48.3, గరిమెళ్లపాడులో 44.8, కొటపల్లిలో 34.5, సుజాతానగర్‌లో 28.8,లక్ష్మిదేవిపల్లిలో 27 మి.మి చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News