Home జాతీయ వార్తలు ప్రభుత్వాసుపత్రి ఐసియులో చేపలు…

ప్రభుత్వాసుపత్రి ఐసియులో చేపలు…

Heavy rains in Patna

పట్నా: పట్నాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో  పలు ప్రాంతాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లనే కాకుండా ప్రభుత్వాసుపత్రి లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో గ్రౌండ్ ప్లోర్ లో ఉన్న జనరల్ వార్డుతో పాటు, ఐసియులోకి వరద నీరు చేరింది.  ఐసియులోకి వచ్చిన నీటిలో చేపలు కూడా దర్శనం ఇవ్వడంతో  పెషెంట్లు షాక్‌కు గురయ్యారు. వరద నీటితో పాటు విష సర్పాలు, ఇతర హానికర కీటకాలు వస్తే తమ పరిస్థితి ఏమిటి అని పెషేంట్లు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలోకి వచ్చిన వరద నీటిని వెంటనే తొలగించేల చర్యలు తీసుకొవాలని పెషెంట్లు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెషెంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.