Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు…

June 7 the monsoon will enter Telangana

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, సనత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. దీంతో రోడ్డుపై నీరు చేరడంతో అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తర మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో 2.1 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర కోస్తా, ఒడిశా పరిసరాల్లో 7.6 కి.మీల ఎత్తులోనూ కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది. 5.8 కి.మీల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండడంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్‌, కొమ్రంభీం, మంచిర్యాల, కరీంనగర్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ వెల్లడించింది.

Comments

comments