విశాఖ : తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉంది. జాలర్లు సముద్రంపైకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఈనెల 13వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.