Home తాజా వార్తలు అల్పపీడనం

అల్పపీడనం

Heavy Rains to Continue For Next 3 Days In States

రాష్ట్రంలో మూడు రోజులపాటు వానలు
ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తర గాం గేటిక్ పశ్చిమబెంగాల్ దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా పశ్చి మ బెంగాల్ ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల ను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం లో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం మరో 24 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. దీంతో  పాటు రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలలో 7.6కిలోమీటర్ల ఎత్తు వద్ద  ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురుస్తాయి. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలోని పలుప్రాంతాలలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.