Home తాజా వార్తలు భారీ వర్షాలు : రైళ్ల దారి మళ్లింపు

భారీ వర్షాలు : రైళ్ల దారి మళ్లింపు

TRAIN-TRAKరంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు వికారాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో వికారాబాద్ – పర్తి మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. వికారాబాద్ – పర్తి మార్గంలో వెళ్లే రైళ్లను ముద్ఖేడ్ – నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు. షిరిడీ – విజయవాడ, పుణె – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, ఔరంగాబాద్ – హైదరాబాద్ ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. బీదర్ -హమ్నాబాద్ డెమూ రైలు, హమ్నాబాద్ -బీదర్ డెమూ రైలును రద్దు చేశారు.