Friday, April 26, 2024

రాయదుర్గంలో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

Heavy Theft In Rayadurgam At Hyderabadహైదరాబాద్: నగరంలోని రాయదుర్గం డిఎన్ఆర్ హిల్స్ లో నేపాల్ ముఠా భారీ చోరీకి పాల్పడింది. బోర్ వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈ చోరీ జరిగింది. రూ.15లక్షలు, 5తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గత కొంతకాలంగా మధుసూదర్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ వాసులు సోమవారం రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారకస్థితిలోకి చేరుకున్నాక నిందితులు చోరీకి పాల్పడ్డారు. మధుసూదన్ రెడ్డితో పాటు భార్య, పిల్లలను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. నలుగురు ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న రాయదుర్గం పోలీసులు సిసికెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి స్పృహలోకి వచ్చాక వివరాలు సేకరించనున్నారు పోలీసులు.

ఈ ఘటనపై మాదాపూర్ డిసిపి వివరాలను వెల్లడించారు. నలుగురు నేపాల్ వాసులు మధుసూదన్ ఇంట్లో పనిచేస్తున్నారు. రాజేందర్ అలియాజ్ రవి, మేనకోడలు సీత కొంతకాలంగా పనిచేస్తున్నారు. రాజేందర్ బంధువులు జానకి, మనోజ్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నారు. రాత్రి పథకం ప్రకారమే చపాతీల్లో మత్తుమందు కలిపారు. అనంతరం నలుగురు కలిసి యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రూ.15లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలు తీసుకెళ్లారని డిసిపి వెంకటేశ్వరులు తెలిపారు. ఆధారాలు లేకుండా సిసిటివి డివీఆర్ తోపాటు బాధితుల సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. నిందితులు హైదరాబాద్ లోనే ఉన్నట్టు సమాచారం. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు సరిహద్దుల్లో గాలిస్తున్నామని. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News