Home నిర్మల్ బాసర గోదావరిలో జలకళ

బాసర గోదావరిలో జలకళ

               Godawari-River

బాసర: బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మొత్తం 14 గేట్లు ఎత్తి వేయ డంతో నూతన నీరు గోదావరి నది వెంబడ పరవళ్లు తొక్కుతూ బాసర గోదావరికి చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు 2 టీఎంసిల నీటిని వదలాలని ఆదేశించి నప్పటికీ శనివారం ఉదయం 10గంటల సమయంలో మహారాష్ట్ర, తెలం గాణ అదికారులు అప్రమత్తమై గేట్లను ఎత్తివేయ డంతో గోదారమ్మ పర వళ్లు తొక్కుతూ వరద నీరుతో బాసరకు చేరుకోవడంతో నదీ కళకళలాడు తుండగా అటు రైతులు చుట్టు పక్కల గ్రామస్తులు ఆశాజ నకంగా చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

గత కొన్ని నెలల నుండి గోదావరి నీరు లేక విలవిలలాడగా బాబ్లీ వరద నీరుతో బాసర గోదావరి జలకళలాడింది. దీంతో ఎస్‌ఆర్‌ఎస్‌పిలో నీటి మట్టం పెరిగే అవ కా శం ఉందని అటు రైతులు, బాసర వచ్చే భక్తులకు పుణ్యస్నా నాలు ఆచరించడానికి పుష్క లంగా నీరు ఉంటుందని ఆలయాధి కారులు భావిస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నీరు రాకతో ఆశాజనకంగా ఎదురు చూస్తున్న దిగువ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.