Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఎత్తు పెరిగే ఆపరేషన్లు ఇండియాలోనే చౌక

1950లో రష్యాలో మొదటి ఆపరేషన్, 1990 దశకంలో భారత్‌లో ప్రవేశం
Doctorమన తెలంగాణ/ హైదరాబాద్‌ః హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఓ యువకుడికి ఎత్తు పెంచుతామని తల్లిదండ్రులకు సమాచారం లేకుండా వై ద్యులు నిర్వహించిన ఆపరేషన్‌పై నైతికతకు సంబంధించిన ప్రశ్నలతో పాటు ఆపరేషన్ చేయించుకున్న యువకుడికి భవిష్యత్తులో ఆరోగ్యం ఎలా వుం టుందనే అంశంపై వైద్య రంగంలోని నిపుణులు భిన్నంగా స్పందించారు. 1950లో రష్యాలో మొదటిసారిగా డాక్టర్ గవ్రిల్ లిజరోవ్ అనే వై ద్యుడు తొలిసారిగా ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. మరుగుజ్జులు, తక్కువ ఎత్తు కలిగి మనో వేధనకు లోనవుతున్న వారికి, మోడలింగ్ రంగంలో ప్రవేశించాలనుకుఏనే అమ్మాయిలు ఈ ఆపరేషన్ చేయించుకునేందుకు ఉత్సాహపడుతుంటారు. ఈ ప్రక్రియ 1990 దశకంలో ఇండియాలో మొదలైంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకన్నా ఇండియాలోనే ఈ ఆపరేషన్ చా లా చౌకగా వుండడంతో విదేశాల నుంచి ఏటా వేలాది మంది భారత్‌కు వస్తూ ఎత్తు పెరిగేందుకు సంబంధించి కాళ్ళకు ఎత్తు పెరిగే ఆపరేష న్లు చేయించుకు ంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 50 వేలకు పైగా ఈ తరహా ఆపరేషన్లు జరుగుతుండగా ఒక్క ఇండియాలోనే వేల సంఖ్యలో జరుగుతున్న ట్లు వైద్య రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో ఎక్కువగా ఢిల్లీ, బెంగుళూరు నగరాలలో ఈ తరహా ఆపరేషన్లు జరుగుతున్నట్లు వా రు చెబుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాలలో చాలా తక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ, బెంగుళూరు నగరాలలో ఈ ఆపరేషన్లకు అయ్యే ఖర్చు లక్షన్నర రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు వుండగా హైదరాబాద్‌లో ఐదు లక్షల రూపాయ లకు పైగానే వసూలు చేస్తున్నారు. విదేశాల్లో పది లక్షల రూపాయలకు పైగా వుండడంతో విదేశీయులు చాలా మంది ఢిల్లీ, బెంగుళూరు నగరాల కు వచ్చి ఎత్తు పెరిగే ఆపరేషన్లు చేయించుకుంటుండడం గమనార్హం. ఈ తరహా ఆపరేషన్ల వల్ల ఒక రెండు ఇంచుల నుంచి అడుగున్నర వరకు ఎత్తు పెరి వీలుందని ఆర్థోపెడిక్ రంగంలోని వైద్యులు చెబుతున్నారు. మరుగుజ్జులకు ఇదో వరమని వారంటున్నారు. మూడు అడుగుల మరుగుజ్జులు అనే క మంది ఆపరేషన్ల తరువాత నాలుగున్నర అడుగుల ఎత్తు పెరిగారని వారంటున్నారు.
ఆపరేషన్ల తరువాత కాళ్లలో పూర్వపు బలంపై అనుమానాలు
ఇదిలావుండగా ఎత్తు పెరిగేందుకు జరిగే ఆపరేషన్ల వల్ల ఆపరేషన్లు చేయించుకున్న వారు తరువాతి కాలంలో ఇదివరకటిలా చురుకుగా వుండ గలుగుతారా..? అనే ప్రశ్నకు ఆర్థోపెడిక్ రంగంలోని నిపుణులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఆపరేషన్లు చేయించుకున్న వారు దీని తదుప రి బలమైన ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని, పిజియోథెరఫీ చేయించుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని, అప్పుడు మ ంచి ఫలితాలుంటాయని వారంటున్నారు. గ్లోబల్‌లో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డి ప్రస్తుతం 5.7 అడుగుల ఎత్తు వుండగా అతను రాబో యే రోజుల్లో ఆరున్నర అడుగుల ఎత్తుకు పెరుగుతాడని వారంటున్నారు. అయితే అతని కాళ్లలో ఇదివరకటి సత్తువ వుంటుందా..? లేదా..? అనే ది అతను భవిష్యత్తులో తీసుకునే ఆహారం, ఇతరత్రా అలవాట్లపై ఆధారపడి వుంటుందని వారంటున్నారు.
నైతికతపైనా సందేహాలు
కాగా ఈ తరహా ఆపరేషన్లు చేసే ముందు సంబంధిత వ్యక్తుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆసుపత్రుల నిర్వాహకులపై వుం దని వైద్య రంగంలోని నిపుణులు అంటున్నారు. నిఖిల్ రెడ్డి మేజర్ అయినప్పటికీ ఈ ఆపరేషన్ క్లిష్టమైనది కావడంతో అతని తల్లిదండ్రులకు స మాచారం ఇవ్వాల్సిందని వారంటున్నారు. ఈ విషయంలో గ్లోబల్ యాజమాన్యంపై ఆ యువకుడి తల్లిదండ్రులు మండిపడుతుండడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

comments