Search
Saturday 17 November 2018
  • :
  • :

జపాన్ లో హలో కిట్టీ బులెట్ రైలు

Bullet-Train

టోక్యో: కార్టూన్ సీరియల్స్ చూసే చిన్న పిల్లలకు ‘హలో కిట్టీ’ పాత్ర తెలియకుండా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ పాత్ర స్ఫూర్తితో జపాన్‌లో పర్యాటకులను ఆకర్షించడానికి ఒకప్రత్యేక బులె ట్ ట్రైన్‌నే రూపొందించారు. తెలుపు, పింక్ రంగుల్లో మెరిసిపోతున్న ఈ అందమైన బులెట్ ట్రైన్ శనివారం ప్రారంభమైం ది. ఫుకువోకా రాష్ట్రంలోని హకాకా స్టేషన్‌నుంచి ఒసాకా నగ రం దాకా ప్రయాణించిన రైలుకు హెల్లో కిట్టీలాగా డ్రెస్ వేసుకున్న కండక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వందల సంఖ్య లో అభిమానులు ఈ ప్రారంభోత్సవ కారక్రమాన్ని తిలకించా రు. ఈ రైలు రాబోయే మూడు నెలల పాటు ఒసాకా, ఫుకోకా నగరాల మధ్య నడుస్తుందని వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలియజేసింది. ఈ రైలుతో పర్యాటక రంగానికి ఎంతో ఊపు లభిస్తుందన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. రైలులోపల ప్రతి కిటికీ షేడ్లలోను చిరునవ్వులు చిందించే కిట్టీ  దర్శనమిస్తుంది. ఒక బోగీలో ప్రయాణికులు సెల్ఫీలు తీసుకోవడం కోసం ఓ నిలువెత్తు కిట్టీ బొమ్మను ఏర్పాటు చేశారు. ఇవే కాక జపాన్ సంస్కృతిని, వారి ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే ఎన్నో ప్రత్యేకతలు ఈ రైల్లో ఉన్నాయి. 1974లో సార్నియో ‘హెల్లో కిట్టీ ’పాత్రను ప్రవేశపెట్టినప్పటినుంచి పెన్సిల్ బాక్స్‌లు మొదలుకొని డబుల్ డెక్కర్ బస్సులు, విమానాల దాకా అన్నిటిమీద  ప్రత్యక్షమయ్యేంతగా పాపులర్ అయింది. గతంలో కూడా వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ఫ్యారీ పోటర్ థీమ్‌తో ‘ హోగ్‌వర్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఒక బులెట్ ట్రైన్‌ను ప్రవేశపెట్టింది. ఆ రైలు ఒసాకా, వశ్చిమ జపాన్‌లోని కగోషిమా స్టేషన్ల మధ్య నడిచింది.

Comments

comments