Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

కిడ్ని వ్యాధి గ్రస్తుల కోసం హెల్త్ క్యాంప్

kidny-Patients

సంస్థాన్‌నారాయణపురం ః నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో కిడ్ని వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వైద్య బృందంచే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పుట్టపాక వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరియైన వైద్యసౌకర్యం లేక కిడ్ని వ్యాధిగ్రస్తులు తరచూ పట్టణాలకు వెళ్ళాలంటే నానా అవస్తలు పడవలసి వస్తుందని కనుక పుట్టపాక గ్రామంలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి కిడ్ని వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని వారు కోరారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే త్వరలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా చర్యలు తీసుకుంటానని, చౌటుప్పల్‌లో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆర్.భావణాఋషి, సీతారాములు, మాధవరెడ్డి, శేఖర్‌రెడ్డి, హనుమంతారావు, శ్రీరాములు, సత్తయ్య తదితరులు ఉన్నారు.

Comments

comments