Home జయశంకర్ భూపాలపల్లి మెరుగైన సేవకు కృషి

మెరుగైన సేవకు కృషి

Help to Patients From CM Relief Funds

మన తెలంగాణ/భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. మంగళ వారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలో వివిధ కారణాలతో అనారోగ్య కారణాలతో వైద్యం చేసుకొని ఆర్థికంగా నష్టపోయిన వారికి సిఎం రిలీఫ్ ఫండ్‌నుండి సహకారం అందించే విధంగా ఎంపిక చేసి ఆర్థికంగా చితికి పోయిన లబ్దిదారుల కుటుంబాలకు కొంచెం రిలీఫ్ అయ్యేవిధంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. భూపాలపల్లి నియోజక వర్గంలోని వివిధ మండలాలనుండి 42 మంది ఆనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్దిదారులకు 18 లక్షల చెక్కులను స్పీకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి తేవడం కోసం జిల్లా లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుందన్నారు. రాబోయే 6 నెలల్లో జిల్లా ఆసుపత్రిని పూర్తి చేసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం తెలంగాణ ముఖ్య మంత్రి సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎంపిపికల్లెపు రఘుపతి రావు, టిఆర్‌ఎస్ నాయకులు పైడిపెల్లి రమేష్, క్యాతరాజ్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.