Home వికారాబాద్ భర్త వేధింపులకు భార్య ఉరి వేసుకుని మృతి

భర్త వేధింపులకు భార్య ఉరి వేసుకుని మృతి

Her husband was suicide to tolerate trouble

కోట్‌పల్లి: చేసుకున్న భర్త పెట్టే బాధలను భరించలేకనే ఉరివేసుకుని మహిళ మృతి చెందిన సంఘటన కోట్‌పల్లి మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉరిపై అనుమానాలను తెలుసుకునేందుకు మృతురాలి తండ్రి అనంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బుధవారం పూడ్చిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ధారూర్ సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం… శంకర్‌పల్లి మండంలోని పర్వేదా గ్రామానికి చెందిన సామ అనంత్‌రెడ్డి కూతురు లలిత (42) మృతురాలును గత 20 సంవత్సరాల క్రితం కోట్‌పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన మదిరే నర్సింహ్మరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరి దాంపత్య జీవితం బాగానే ఉన్నా తరుచుగా గొడవలు చేయడంతో పలుమార్లు తల్లిగారి ఇంటికి వెళ్లి తమ అన్నలతో చెప్పగా వారు నర్సింహ్మరెడ్డికి తాగి గొడవలు పెట్టుకోవద్దని మీరు మంచిగుండాలని చెప్పిన మారకపోవడం ఈ సంఘటనకు కారణమైందని, భర్త, అత్త, మామలు పెట్టే బాధలు భరించలేకనే ఉరివేసుకుందని, అలా కాకుండా భర్త కొట్టి ఉరివేశాడా… అనే కోణంలో వచ్చిన అనుమానాలను తెలుసుకునేందుకు మృతురాలు తండ్రి అనంత్‌రెడ్డి పోలీసులను ఆశ్రహించడం జరిగింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ధారూర్ సిఐ ఉపేందర్, స్థానిక తహసీల్దార్ బుచ్చయ్య, ఎస్‌ఐలు ఏడుకొండలు, శేఖర్‌గౌడు, మర్పల్లి డాక్టర్ రాజు, పోలీసుల బందోబస్తు మధ్య 50 రోజుల క్రితం అనగా మే 13వ తేదిన ఉరివేసుకుని మృతి చెంది పూడ్చి పెట్టిన శవాన్ని వెలికి తీసి పంచనామ, పోస్టుమార్టం నిర్వహించి లలిత చావుకి కారణమైన భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసినట్టు సిఐ ఉపేందర్ తెలిపారు.