Home సినిమా అక్కినేని వారి పెళ్లి పత్రిక..!

అక్కినేని వారి పెళ్లి పత్రిక..!

Chai-Sam-W-Invitation

హైదరాబాద్ : అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ ప్రేమపక్షులు అక్కినేని నాగచైతన్య, సమంత వచ్చే నెల వివాహమాడనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అక్టోబర్ 6, 7, 8వ తేదీల్లో సమంత, చైతన్యలు గోవాలో వివాహం చేసుకోనున్నట్లు పత్రికలో పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ, రామానాయుడు, రాజేశ్వరి దీపెనలతో అని పెళ్లి పత్రికలో పేర్కొన్నారు. గోవాలోని ‘డబ్ల్యూ’ హోటల్ లో ఈ వేడుక జరుగనుంది. ఈ పెళ్లి హిందూ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాల్లో జరుగనున్నట్లు సమాచారం.

తొలి చిత్రం ‘ఏం మాయ చేశావే’ నుంచే ప్రేమలో పడ్డ వీరిరువురు.. గతేడాది తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశారు. అక్కినేని నాగార్జున స్వయంగా తన కోడలు సమంతానే అని ప్రకటించారు. అనంతరం జనవరి 29న నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం సమంతా రాంచరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తోంది. చైతన్య ‘యుద్ధం శరణం’ చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు.