Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఆది హీరోగా చిత్రం షురూ

aadi

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా… డిసిపి కృష్ణమోహన్ కెమెరా స్విచ్చాన్ చేయడం జరిగింది. సాయికుమార్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ “ప్యూర్ లవ్ స్టోరీ ఇది. మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నా కెరీర్‌లో ఇది మంచి సినిమా అవుతుంది”అని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ “మంచి ప్రేమ కథతో వస్తున్నాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధిక, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు”అని తెలిపారు. నిర్మాత చావలి రామాంజనేయులు మాట్లాడుతూ “సీమశాస్త్రి సినిమా తర్వాత మేము ఈ సినిమా చేస్తున్నాము. బౌండెడ్ స్క్రిప్ట్‌తో దర్శకుడు మా దగ్గరికి వచ్చారు. కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాము”అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః సాంబ భీమవరపు, మ్యూజిక్‌ః అరుణ్ చిలువేరు, ఎడిటర్‌ః ఉద్ధవ్, ఆర్ట్‌ః టి.రాజ్ కుమార్, ఫైట్స్‌ః రియల్ సతీష్, డైలాగ్స్‌ః సురేంద్ర కృష్ణ, పడాల శివ సుబ్రమణ్యం.

Comments

comments