Home తాజా వార్తలు ప్రేమలో ఆమిర్‌ ఖాన్‌ కూతురు

ప్రేమలో ఆమిర్‌ ఖాన్‌ కూతురు

Hero Aamir Khan ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ప్రముఖ సంగీత కళాకారుడు మిశాల్ తో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇరానే స్వయంగా వెల్లడించారు. ఇరా, మిశాల్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మిశాల్ తో కలిసి ఉన్న ఫొటోలను ఇరా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో వీరు కచ్చితంగా ప్రేమలోనే ఉన్నారన్నవార్తలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇరా బదులిస్తూ… తాను మిశాల్ తో ప్రేమలో ఉన్నట్టు ఆమె అంగీకరించారు. మిశాల్ ను హత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవల ఆమిర్ ఖాన్ తన కూతురు ఇరా గురించి పలు విషయాలు వెల్లడించారు. ఇరా మనస్సులో ఏముందో తనకు కచ్చితంగా తెలియదని, ఆమెకు ఫిల్మ్ మేకింగ్, సినిమాలంటే ఆసక్తి ఉందని మాత్రం తనకు అర్ధమైందని , ఆమె సినిమాలనే కెరీర్ గా ఎంచుకునే అవకాశం ఉందని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు.

Hero Aamir Khan Daughter Ira in Love