Home జాతీయ వార్తలు కేరళకు అల్లు అర్జున్ విరాళం

కేరళకు అల్లు అర్జున్ విరాళం

Hero Allu Arjun Donates for Kerala Flood Victims

హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ ప్రజలకు తెలుగు హీరో అల్లు అర్జున్ రూ. 25లక్షల విరాళాన్ని ప్రకటించారు. వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమై ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళ పరిస్థితిపై అన్ని భాషల నటులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ స్పందించి భూరీ విరాళం ప్రకటించారు. కేరళ ప్రజలు తనపై అపారమైన ప్రేమానురాగాలను కురిపిస్తారని ఆయన ట్వీట్ చేశారు. వారికి తన మనస్సులో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కేరళ ప్రజలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ ప్రజలకు యావత్ భారత్ అండగా ఉండాలని ఆకాంక్షించారు.

Hero Allu Arjun Donates for Kerala Flood Victims