Home తాజా వార్తలు త్వరలో హీరో ఆర్య పెళ్లి

త్వరలో హీరో ఆర్య పెళ్లి

Hero Arya's Weddingచెన్నయ్ : ప్రముఖ హీరో ఆర్య పెళ్లి కొడుకు కాబోతున్నాడు. వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి పరిచయమైన హీరో ఆర్య‌(38), అఖిల్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన స‌యేషా సైగ‌ల్‌(21)లు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. మార్చి 9, 10 తేదీలలో వీరి పెళ్లి హైదరాబాద్ లో జరగనుందని సమాచారం. చెన్నయ్ లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. 2018లో వచ్చిన గజినీకాంత్ సినిమాలో ఆర్య, సయేషా సైగల్ కలిసి నటించారు. ప్రస్తుతం ఆర్య సూర్య కెవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కప్పం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స‌యేషా హిందీలో శివాయ్ అనే చిత్రం చేసింది.  వ‌న‌మ‌గ‌న్ చిత్రంతో సయేషా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. స‌యేషా ప్ర‌ముఖ న‌టులు సుమీత్ సైగల్, షాహీన్‌ల కూతురు అన్న విషయం తెలిసింది.  ఈ క్రమంలో అలనాటి నటులు దిలీప్ కుమార్, సైరా భానుల సయేషా మ‌న‌వ‌రాలు అన్న విషయం కూడా విదితమే.

Hero Arya’s Wedding Soon