Home తాజా వార్తలు సిగ్నల్స్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లండి: కల్యాణ్ రామ్

సిగ్నల్స్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లండి: కల్యాణ్ రామ్

 

హైదరాబాద్: భద్రతా నియమాలు తెలిసినా కొన్ని సార్లు నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు పోతున్నాయని టాలీవుడ్ నటుడు కల్యాణ్ రామ్ తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ మైదానంలో జరిగిన 30వ రహదారి భద్రతా వారోత్సవాలలో కల్యాణ్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో తమ అన్నయ్యను 2018లో  నాన్నను రోడ్డు ప్రమాదంలో కోల్పోయామన్నారు. ప్రాణం కంటే మించింది ఏదీ లేదని స్పష్టం చేశారు. వాహనదారులు రహదారిపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. సిగ్నల్స్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి సమయం మించిపోదని  కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. ప్రజల బాగోగుల కోసమే పోలీసులు ఉన్నారని తెలిపారు.

 

Hero Kalyan Ram Suggestion on Road Accidents