Home తాజా వార్తలు ఎన్‌టిఆర్‌కు కల్యాణ్‌రామ్ ఖరీదైన గిఫ్టు

ఎన్‌టిఆర్‌కు కల్యాణ్‌రామ్ ఖరీదైన గిఫ్టు

Hero Kalyanram Gave the Expensive Gift to NTR

హైదరాబాద్ : హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ప్రముఖ హీరో , తన తమ్ముడు , జూనియర్ ఎన్‌టిఆర్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చారు. మే20 ఎన్‌టిఆర్ తన 35వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కల్యాణ్ రామ్ కోటి రూపాయల విలువైన రిచర్డ్ మిల్ అనే స్విస్ కంపెనీ చేతి గడియారాన్ని ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఎన్‌టిఆర్‌కు చేతి గడియారాలంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కల్యాణ్‌రామ్ ఈ వాచ్‌ను యూరప్ నుంచి తెప్పించారు. ఇరువు సోదరులకు ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉందన్న విషయం తెలిసిందే. కల్యాణ్‌రామ్ తన తమ్ముడు ఎన్‌టిఆర్‌ను ప్రేమగా నాన్నా అని పిలుస్తారు. ఒకరి సినిమాలకు ఒకరు మద్దతు తెలుపుకుంటారు. ఎన్‌టిఆర్ నటించిన జై లవకుశ సినిమాను కల్యాణ్‌రామ్ నిర్మించిన విషయం తెలిసిందే.

Hero Kalyanram Gave the Expensive Gift to NTR