Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘హిప్పీ’ సినిమా షురూ

Hippi

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో క్రేజీ హీరోగా పేరుతెచ్చుకున్న కార్తికేయ, స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టిఎన్ కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘హిప్పీ’. వి క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ “ఆర్‌ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా ఇది. దర్శకుడు టిఎన్ కృష్ణ చెప్పిన విభిన్నమైన కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాను. కలైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసి మరింత ఉత్సాహం కలిగింది. ఈ సినిమా నా కెరీర్‌ను టాప్ లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను”అని అన్నారు. దర్శకుడు టిఎన్ కృష్ణ మాట్లాడుతూ “దర్శకుడిగా తెలుగులో నా తొలి చిత్రమిది. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్ 100’ చూశాను. నాకు బాగా నచ్చింది. కార్తికేయ బాడీ లాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రమిది”అని తెలిపారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ “హిప్పీ సినిమా కథ తెలుగువారందరికీ నచ్చుతుంది. ‘ఆర్‌ఎక్స్ 100’ చూసిన తర్వాత కార్తికేయ ఈ సినిమాకు  సరిగ్గా సరిపోతాడనిపించింది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆతర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం”అని చెప్పారు. కార్తికేయ, జెడి చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః ఆర్‌డి రాజశేఖర్, సంగీతంః నివాస్ కె.ప్రసన్న, సాహిత్యం ః అనంత శ్రీరాం, మాటలుః టిఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి, స్టంట్స్‌ః దిలీప్ సుబ్బరాయన్.

Hero Karthikeya’s Hippi Movie Shooting Started 

Telangana News

Comments

comments