Home తాజా వార్తలు ఇంటర్ ఫలితాలు… నాని ఎమోషనల్ ట్వీట్

ఇంటర్ ఫలితాలు… నాని ఎమోషనల్ ట్వీట్

Hero Naniహైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫెయిల్ అయిన, తక్కువ మార్కులు వచ్చిన కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. చదువు కంటే జీవితం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. చదువంటే మార్కుల పత్రాలు కాదని, కేవలం నేర్చుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. చదువుకంటే జీవితంలో చాలా విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. సమస్యలను ఎదుర్కోవాలే తప్ప తనువు చాలించవద్దని ఆయన కోరారు. క్షణికావేశంలో తీసుకునే ఇటవంటి నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు తీరని శోకంలో మునిగిపోతున్నారని, అందువల్ల విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Hero Nani Emotional Tweet on Inter Students Suicides