Home హైదరాబాద్ హీరో నితిన్ పై కేసు కొట్టివేత..

హీరో నితిన్ పై కేసు కొట్టివేత..

Nithin-image

మన తెలంగాణ/ హైదరాబాద్ : అఖిల్ సినిమా హక్కులు ఇవ్వలేదం టూ తెలుగు సినిమా హీరో నితిన్, ఆయన సోదరిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేస్తూ తీర్పు చెప్పింది. హీరో నితిన్, ఆయన సోదరి నిఖితా రెడ్డిలపై అభియోగాలను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఎం. సత్య నారాయణ మూర్తి ఇటీవల తీర్పు చెప్పారు. అఖిల్ అనే సినిమా హక్కుల కోసం తమ వద్ద రూ.50 లక్షలు తీసుకుని ఇవ్వలేదంటూ స్థానిక సైనిక్‌పూరి కాలనీకి చెందిన గంగాధర సత్యనారాయణ మల్కాజిగిరిలోని 20వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 2017 సప్టెంబర్‌లో కేసు వేశారు. ఈ కేసులో వరసగా శ్రేష్ట మూవీస్, నిర్మాత అయిన నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డిలపై, నిఖిత, అఖిల్‌లు నిందితులుగా చేర్చిన కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. శ్రేష్ట మూవీస్ సుధాకర్‌రెడ్డికి సంబంధించినదని, తమపై కావాలని కేసు పెట్టారని నితిన్, నిఖితల వాదనను హైకోర్టు ఆమోదించింది.