Home తాజా వార్తలు ఐపిఎల్ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్‌టిఆర్ (వీడియో)

ఐపిఎల్ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్‌టిఆర్ (వీడియో)

NTR

హైదరాబాద్ : ఐపిఎల్ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో ఎన్‌టిఆర్ నియామకమయ్యారు. తొలిసారిగా ఐపిఎల్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్  తెలుగులో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ గ్రూప్ అధికారులు తెలుగు ప్రచారకర్తగా హీరో ఎన్‌టిఆర్ ఎంపిక చేశారు. సరిహద్దుల్లేని ఆట క్రికెట్ అని ఎన్‌టిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన చిన్నప్పుడు తన తండ్రి హరికృష్ణతో కలిసి క్రికెట్‌ను వీక్షించేవాడినని ఆయన పేర్కొన్నారు. తన కొడుకు అభయ్‌రాంకు క్రికెట్ నేర్పిస్తానని ఆయన తెలిపారు. ఆట కూడా ఒక భాష లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంటే తనకు అభిమానమని ఎన్‌టిఆర్ తెలిపారు. సింహాద్రి సినిమా విజయం తొలి సిక్స్ కొట్టినంత ఆనందం ఇచ్చిందని చెప్పారు. క్రికెటర్ల జీవితాలు సినిమాలుగా రావడం హర్షణీయమన్నారు. అయితే వారి బయోపిక్స్ చేయడానికి తాను సాహసించనన్నారు.

Hero NTR Appointment as Brand Ambassador to IPL