Home సినిమా వచ్చే ఏడాదే రెండు సినిమాలు

వచ్చే ఏడాదే రెండు సినిమాలు

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ స్టార్‌గా వెలిగిపోతున్నారు. ఈ అగ్ర హీరో ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో ఈ భారీ యాక్షన్ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇక అదే సమయంలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో కూడా ప్రభాస్ నటిస్తూ వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ ప్రేమ కథా చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇక ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామని చెబుతున్నా భారీ విఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ప్రభాస్ 20వ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లవ్‌స్టోరీ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది? అన్నదానికి తాజాగా దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీనిచ్చారు. ఈ సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయం పడుతుందని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ చిత్రం విడుదల ఉంటుందని క్లారిటీనిచ్చారు. అయితే వచ్చే ఏడాది ఆగస్టులో ‘సాహో’ విడుదల అయితే ఆతర్వాత డిసెంబర్ లేదా 2020 సంవత్సరం జనవరిలో ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. యూరప్ దేశాల్లో సాగే అద్భుతమైన ప్రేమకథా చిత్రమిదని ప్రచారం సాగుతోంది. ఇందులో చేతి రేఖలు చూసే హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ నటిస్తున్నారు. అయితే అతని ప్రేయసిగా పూజ అందచందాలు మైమరపిస్తాయట.

Hero Prabhas Making Two Movie in Next Year

Telangana News