Home సినిమా ప్రభాస్‌తో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా?

ప్రభాస్‌తో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా?

Prabhas

బ్లాక్‌బస్టర్ హిట్ ‘రంగస్థలం’ తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు భారీ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత అతను ఏ సినిమా చేయబోతున్నారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోసం  ఓ మంచి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మైత్రి బ్యానర్‌లో రూపొందే ఈ సినిమాకు మహేష్ ఇంతకుముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సూపర్‌స్టార్ ప్రస్తుతం చేస్తున్న ‘మహర్షి’ చిత్రం షూటింగ్ మూడు, నాలుగు నెలలు సాగనుంది. ఈలోపు మహేష్‌ను మెప్పించే కథను సిద్ధం చేయనున్నారు సుకుమార్. ఇక తాజా సమాచారం ప్రకారం సుకుమార్ నెక్స్ మూవీని కూడా ప్లానింగ్ చేస్తున్నారట. మహేష్‌తో సినిమా పూర్తికాగానే ప్రభాస్‌తో సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల షూటింగ్‌లలో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది చివరికి పూర్తవుతాయి. ఈలోగా సుకుమార్ మహేష్ సినిమాను ఓ కొలిక్కి తెస్తారు. కాబట్టి వచ్చే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో ప్రభాస్‌తో ఈ స్టార్ డైరెక్టర్ కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండడం ఖాయం.