Home తాజా వార్తలు టివి చానెల్ ను ప్రారంభించనున్న హీరో ప్రభాస్?!

టివి చానెల్ ను ప్రారంభించనున్న హీరో ప్రభాస్?!

Hero Prabhasహైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్, హీరో ప్రభాస్ తన స్నేహితులతో కలిసి టివి చానెల్ ను ప్రారంభిస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి చాలా మంది హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ప్రభాస్ స్నేహితులు వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ లు త్వరలోనే ఓ తెలుగు టివి చానల్ ను ప్రారంభించాలని నిర్ణయించారని, ఇందులో ప్రభాస్ కూడా భాగస్వాములవుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభాస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  సూళ్లూరుపేట సమీపంలో ప్రభాస్ దేశంలోనే అతి పెద్ద  సినిమా థియేటర్ ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ థియేటర్ ప్రారంభమవ్వనుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, హీరో అక్కినేని నాగార్జున తదితరులు ఓ చానెల్ లో భాగస్వాములుగా ఉన్న విషయం విదితమే. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎఎంబి సినిమాస్ పేరుతో సినిమా ప్రదర్శన రంగంలో అడుగుపెట్టారు. మహేశ్ మాదిరిగానే అల్లు అర్జున్ ఓ మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారు.

Hero Prabhas To Launch TV Channel