Home సినిమా వీడియోలు మీ కుక్కలు జాగ్రత్త.. ఎందుకంటే ఇతడు కుక్కల కిడ్నాపర్

మీ కుక్కలు జాగ్రత్త.. ఎందుకంటే ఇతడు కుక్కల కిడ్నాపర్

Kittugadu-Vunnadu-Jagrathaషార్ట్ ఫిలిమ్స్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సూపర్ సక్సస్ అయిన హీరో రాజ్ తరుణ్. రొటీన్ కథలే కాకుండా.. కాస్త విభన్న కథలను ఎంచుకోవడంలో రాజ్ తరుణ్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ ఏడాది మంచు విష్ణుతో కలిసి రాజ్ తరుణ్ ‘ఆడోరకం-ఇడోరకం’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో రాజ్ తరుణ్ కిడ్నాపర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే  మనుషులు కిడ్నాపర్‌గా కాదు. కుక్కల కిడ్నాపర్‌గా కనిపించనున్నాడు.

ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మజ్ను ఫేం అను ఇమ్మన్యూల్ నటిస్తోంది.  కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.