హైదరాబాద్ : ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ కల్కి ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అ’ ఫేం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 19983 నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని చాలా విభిన్నంగా రూపొందించారు. కత్తి, చేపలు, సింహం, బాణం, ధనస్సు తదితర వస్తువులను చూపించారు. వాటిని కలిపితే కల్కి అనే టైటిల్ ఏర్పడింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్‌ను విడుదల చేసిన విషయం విదితమే. గత ఏడాది రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)లో అసిస్టెంట్ కమిషనర్‌గా నటించి ఆకట్టుకున్నారు. పూజా కుమార్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఎం.కోటేశ్వర్రావు గరుడవేగను నిర్మించారు.