Home సినిమా మణిరత్నం మల్టీస్టారర్‌లో రామ్‌చరణ్

మణిరత్నం మల్టీస్టారర్‌లో రామ్‌చరణ్

RamCharan

సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈనెల 20న ప్రారంభంకానుండగా… 22  నుంచి హీరోయిన్ సమంత చిత్రీకరణలో పాల్గొననుంది. అయితే రామ్‌చరణ్ నెక్స్ మూవీ కూడా ఖరారైపోయిందని సమాచారం. దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో చరణ్ నెక్స్ మూవీ ఉండనుందని అంటున్నారు. కార్తి, అదితిరావు హైదరీలతో తీస్తున్న ‘చెలియా’ చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నాడు మణిరత్నం.

ఆతర్వాత ఆయన రామ్‌చరణ్‌తో సినిమా చేయనున్నాడు. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ఈ చిత్రంలో రామ్‌చరణ్ సోలో హీరో కాదని మరో ఇద్దరు తమిళ స్టార్లు నటించబోతున్నారని తెలిసింది. విజయ్, విక్రమ్‌లు కూడా ఈ సినిమాలో హీరోలుగా నటించనున్నారట. భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ సౌతిండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌లలో ఒకటిగా నిలవనుంది. రామ్‌చరణ్, విజయ్, విక్రమ్ కాంబినేషన్‌లో రూపొందే ఈ మూవీ అప్పట్లో వచ్చిన దళపతి చిత్రం మాదిరిగా స్ట్రాంగ్ స్టోరీతో… ఎవరి పాత్ర కూడా తక్కువ, ఎక్కువ అనే స్థాయిలో లేకుండా ఉంటుందట. అందరికీ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పటికే చరణ్, విజయ్, విక్రమ్‌లు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఈ మూవీ ప్రారంభం కావడం ఇక లాంఛనమేనట