Search
Sunday 23 September 2018
  • :
  • :

చంద్రబాబును కలిసిన దగ్గుబాటి రానా

Hyderabad : Hero Rana Daggubati Meets AP CM Chandrababu Naidu

హైదరాబాద్ : ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిశారు. దివంగత నటుడు, మాజీ సిఎం ఎన్‌టిఆర్ జీవితాధారంగా ‘ఎన్‌టిఆర్’ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌టిఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్‌టిఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. దీంతో తన పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమావ్వాలని రానా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబును కలిసి ఈ సినిమా గురించి చర్చించారు. ఈ భేటీలో చిత్ర దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్‌టిఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌లో రానాపై సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు.

Comments

comments