Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

యువతిపై హీరో అత్యాచారం

SUBBU

బెంగళూరు : కన్నడ హీరో సుబ్రహ్మణ్యం ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజాజినగర్‌కు చెందిన ఓ యువతి సుబ్రహ్మణ్యాన్ని రెండేళ్లుగా ప్రేమిస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. నవంబరు 1న యువతికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, అత్యాచారం చేశాడు. ఆ తరువాత తనను పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి సుబ్రహ్మణ్యాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి పోలీసులను ఫిర్యాదు చేసింది. సుబ్రహ్మణ్యం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Hero Raped the Young woman

Comments

comments