Home సినిమా స్టార్ డైరెక్టర్ బ్యానర్‌లో…

స్టార్ డైరెక్టర్ బ్యానర్‌లో…

Sai-Dharam-Tej

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎక్కువ కాలం కొనసాగాలంటే హిట్స్ చాలా ముఖ్యం. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా హిట్స్ లేకపోతే సినిమా అవకాశాలు రావడం కష్టమైపోతుంది. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ కెరీర్ ప్రారంభంలో తడబడ్డా ఆతర్వాత రెండు, మూడు హిట్స్‌తో హీరోగా నిలదొక్కుకున్నాడు. అనంతరం వరుసగా ఫ్లాపులు రావడంతో అతను ఎంతో నిరాశచెందాడు. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా ఆగస్టులో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ దాన్ని వాయిదావేసి రెండు నెలలు బ్రేక్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో అతను అమెరికా వెళ్లి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి కొత్త లుక్‌తో సినిమాలకు సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం తేజు కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ రంగంలోకి దిగాడట. తేజు నెక్స్ సినిమాను సుకుమార్ రైటింగ్ బ్యానర్‌పై నిర్మించడమే కాకుండా ఆ సినిమాకు సుకుమార్ కథ కూడా అందిస్తాడట. ఈ సినిమాకు ‘భం భోలేనాథ్’ దర్శకుడు కార్తీక్‌వర్మ దర్శకత్వం వహిస్తాడట. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేస్తారని సమాచారం. సుకుమార్ బ్యానర్‌లో తెరకెక్కే ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ మళ్లీ విజయాల బాట పడతాడేమో వేచి చూడాలి.