Search
Friday 21 September 2018
  • :
  • :

శర్వానంద్ కొత్త చిత్రం ప్రారంభం

Sharvanandశర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై కొత్త సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేయగా దిల్‌రాజు క్లాప్ కొట్టారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను దర్శకనిర్మాతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, వై.రవిశంకర్ తదితరులతో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరిలు మాట్లాడుతూ “సినీ ప్రముఖుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో మా సినిమా ప్రారంభోత్సవం జరగడం ఆనందంగా ఉంది.  వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం”అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః విశాల్ చంద్రశేఖర్.

Comments

comments