Home తాజా వార్తలు పెళ్లి ఆలోచన లేదు : శింబు

పెళ్లి ఆలోచన లేదు : శింబు

Hero Simbuచెన్నయ్ : ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ప్రముఖ కోలీవుడ్ నటుడు శింబు తేల్చిచెప్పారు. వచ్చే ఆగస్టులో శింబు పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పెళ్లి వార్తలపై శింబు స్పందించారు. తన పెళ్లి గురించి వస్తున్న తప్పుడు వార్తలను ఆయన ఖండించారు. పనిలో భాగంగా తాను చాలా మందిని కలుస్తానని, ప్రస్తుతం తాను తన కెరీర్ పైనే దృష్టి పెట్టినట్టు ఆయన వెల్లడించారు. తాను పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ చెబుతానని ఆయన పేర్కొన్నారు. శింబు మొదట లేడీసూపర్ స్టార్ నయనతారతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు బ్రేకప్ పడింది. అనంతరం ఆయన ప్రముఖ నటి హన్సికను పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ ప్రేమ కూడా బెడిసి కొట్టింది. దీంతో శింబు కాసింత నిరాశకు గురయ్యారని, కెరీర్ పై కూడా సరిగా దృష్టి పెట్టలేదని కోలీవుడ్ లో పుకార్లు వచ్చాయి. ఇటీవలే శింబు తమ్ముడి పెళ్లి జరిగింది. దీతో శింబు పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. తన తల్లి ఉష తరపు బంధువుల అమ్మాయిని శింబు పెళ్లి చేసుకోబోతున్నాడని కోలీవుడ్ కోడై కూసింది. అయితే ఈ వార్తలను శింబు ఖండించారు. ఈ అసత్య వార్తలను నమ్మొద్దని ఆయన తన అభిమానులను, శ్రేయోభిలాషులను కోరారు. ప్రస్తుతం శింబు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Hero Simbu Opens Up On Wedding Rumours