Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రైతుల పట్ల హీరో విశాల్ ఔదార్యం

vishal

హైదరాబాద్: తమిళ హీరో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ సినిమా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలోనూ విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం రూ.12 కోట్లు రాబట్టింది. కాగా, ‘అభిమన్యుడు’ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో విశాల్ టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమిళ రైతులతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులకు కూడా ఈ సినిమా సాధించిన వసూళ్లలో కొంత లాభాన్ని పంచాలని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

Comments

comments