Home సినిమా ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం

ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం

Heroin Supriya  like challenging roles in Tollywood movies

అడివిశేష్, శోభిత ధూళిపాళ హీరోహీరోయిన్లుగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. తాజాగా విడుదలైన ఈ చిత్రం ద్వారా సుప్రియ యార్లగడ్డ 22 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ “శశి, అడివిశేష్ నా దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ వివరించి నదియా ఖురేషి పాత్రలో నటించమని అడిగారు. చివరికి కథ నచ్చి ఈ సినిమా చేశాను. రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది. కొత్తదనంతో కూడిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతోంది. అక్కినేని అభిమానులు  సినిమాలో నా నటనను చూసి అభినందిస్తున్నారు. ఇక ముందు కూడా సినిమాలు చేస్తాను. కానీ బలమైన పాత్రలు వస్తేనే నా నటనను కొనసాగిస్తాను. ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి నేను ఇష్టపడతాను. అప్పుడే నా సత్తా ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం నేను అన్నపూర్ణ స్టూడియో నిర్వహణను చూసుకుంటున్నాను. నా సమయాన్ని అంతా స్టూడియోకే కేటాయిస్తున్నాను”అని అన్నారు.