Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

త్రిష ‘మోహిని’ ట్రైలర్ రిలీజ్

trisha

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ త్రిష ఇప్పుడు ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం త్రిష హారర్ జోనర్ లో  ‘మోహిని’ అనే తమిళ చిత్రంలో కీలకపాత్ర  పోషించింది. ఈ చిత్రానికి ఆర్‌. మాదేష్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 27న  తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా  చిత్ర బృందం ‘మోహిని’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం’ అంటూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అసలు మోహిని ఎవరు? ఆమెను ఎవరు చంపారు? త్రిష శరీరంలోకి మోహిని ఆత్మ ఎలా ప్రవేశించిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని చిత్రయూనిట్ తెలిపింది.ఈ ట్రైలర్ సిినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రిన్స్‌ పిక్చర్స్‌, శ్రీలక్ష్మి పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌, శ్రీనివాసరావు, కరణం మధులతలు నిర్మిస్తున్నారు. ‘ఇందులో ఒక సామాజిక సమస్యను కూడా ప్రస్తావించాం. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అది ఉంటుంది. ముఖ్యంగా మహిళలు దీనికి కనెక్ట్‌ అవుతారు’ అని దర్శకుడు మాదేష్‌ పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

 

Comments

comments