Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

త్రివిక్రమ్, ఎన్‌టిఆర్ సినిమాకు హీరోయిన్ దొరికింది

NTR---Trivikram-Movie

హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ కాంబొలో ఓ మూవీ ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో హీరోయిన్ విషయానికి వస్తే తొలుత అను ఇమాన్యుయల్ పేరు వినిపించింది. అనంతరం బాలీవుడ్ భామా శ్రద్ధా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కాగా, ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ దాన్ని నిజం చేస్తూ ప్రకటన చేసింది. పూజాను తమ మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీనిపై పూజా స్పందించింది. ఎన్‌టిఆర్, త్రివిక్రమ్ లాంటి స్టార్ కాస్టింగ్‌తో పనిచేయబోతునందకు చాలా సంతోషంగా ఉందన్నారు. మొదట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌ను తీసుకున్న చిత్ర యూనిట్ అజ్ఞాతవాసి చిత్రం బోల్తాపడడంతో అతడి స్థానంలో ఎస్‌ఎస్ థమన్‌ను తీసుకుంది. ఏప్రిల్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ట్వీట్ చేసింది.

Comments

comments