Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మోక్షజ్ఞకు జోడీగా రకుల్

Heroine Rakul Preet Singh act in NTR Biopic

హైదరాబాద్ : టిడిపి వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్‌టిఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్‌టిఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్‌టిఆర్ సతీమణి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. అయితే ఎన్‌టిఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నటిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌టిఆర్ చిన్నతనానికి సంబంధించిన పాత్రలో మోక్షజ్ఞ నటిస్తున్నారని, ఆయనకు జోడీగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రకుల్ పాలు అమ్మే యువతి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మోక్షజ్ఞతో కలిసి ఆమె కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తుందని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై స్పష్టతరావాల్సి ఉంది. ఎన్‌టిఆర్ సినిమాలో ప్రముఖ దివంగత నటి శ్రీదేవి పాత్రలో రకుల్ నటించనుందన్న మరో వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, బిఎ సుబ్బారావు పాత్రలో సీనియర్ నరేష్, పింగలి నాగేంద్రరావు పాత్రలో సంజయ్‌రెడ్డి, నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నట్టు సమాచారం.

Heroine Rakul Preet Singh act in NTR Biopic

Comments

comments