Home జాతీయ వార్తలు బ్రదర్స్ రీమేక్‌లో ఎవరిద్దరు?

బ్రదర్స్ రీమేక్‌లో ఎవరిద్దరు?

Untitled-1ఒక భాషలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చెయ్యడం అనేది సినీ పరిశ్రమలో చాలా కామన్‌గా జరిగే విషయం. కానీ ఒక భాషలో ఇంకా రిలీజ్ కాని సినిమాని వేరే భాషలో రీమేక్ చెయ్యాలనుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సంఘటన టాలీవుడ్‌లో చోటుచేసుకోనుంది. అసలు విషయానికొస్తే… బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్-యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బ్రదర్స్’. ఈ సినిమా హాలీవుడ్‌లో హిట్ అయిన ‘వారియర్’ సినిమాకి రీమేక్. దేశ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ మిర్చందాని ఈ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు.

అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రామ్‌చరణ్‌లతో పాటు రానాను పరిశీలిస్తున్నాడు. తాజాగా నిర్మాత రామ్… ప్రభాస్, రానా, రామ్‌చరణ్‌లను కలిసి ఈ సినిమా తెలుగు రీమేక్ గురించి తెలియజేశాడు. ఈ ముగ్గురు హీరోలలో ఇద్దరు మాత్రమే ఫైనల్ అవుతారు. ఈ చిత్ర నిర్మాత తెలుగులోనే కాకుండా తమిళ్ రీమేక్ కోసం అన్నదమ్ములైన స్టార్ హీరోలు సూర్య, కార్తీతో పాటు విక్రమ్‌ను కూడా కలిసినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. మరోవైపు రామ్‌చరణ్, రానాలు చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. అభిమానుల్లో క్రేజ్‌ను పెంచేసిన ఈ మూవీ అధికారిక ప్రకటన కోసం మరికొద్ది రోజలు వేచి చూడాల్సిందే.