Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్‌!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్‌!

High Alert in Shamshabad Airport: Rangareddy

రంగారెడ్డి: ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం నుంచి 20వ తేదీ వరకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతా పెంచారు. అలాగే సందర్శకులకు కూడా అన్ని రకాల పాసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టుకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా సోదాలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణీకులు, సందర్శకులు తనిఖీలకు సహకరించాల్సిందిగా అధికారులు కోరారు.