Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

29న హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు..

High-cort

హైదరాబాద్: మార్చి 29న ఉమ్మడి హైకోర్టులోని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధిత నామినేషన్ల గడువు గురువారంతో ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇద్దరు కార్యదర్శులు, కోశాధికారితోపాటు వివిధ పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి అధ్యక్ష పదవికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టిఆర్‌ఎస్‌కు చెందిన న్యాయవాది ఆర్ వినోద్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ న్యాయసలహాదారుడు దామోదర్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన పొన్నం అశోక్‌గౌడ్ అధ్యక్ష పదవికి నువ్వనేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. వినోద్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు తమ పూర్తి మద్దతు  ప్రకటించారు.

Comments

comments