Home జాతీయ వార్తలు చిరుపై కేసు ర‌ద్దు చేసిన హైకోర్టు

చిరుపై కేసు ర‌ద్దు చేసిన హైకోర్టు

Chiranjeeviగుంటూరు : 2014లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని మెగాస్టార్ చిరంజీవి ఉల్లంఘించారంటూ గుంటూరు అరండల్‌పేట్‌ ఠాణాలో గతంలో ఓ కేసు న‌మోదైన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసును స‌వాలు చేస్తూ చిరంజీవి హైకోర్టుని ఆశ్ర‌యించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న చిరంజీవిపై అధికారులు అక్ర‌మంగా కేసు న‌మోదు చేశార‌ని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్‌ టి.రజనీ ఈ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చిరంజీవి ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సైరా న‌ర‌సింహ‌రెడ్డి  సినిమాలో నటిస్తున్నారు. వచ్చే దసరాకు ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

High Court Cancel Chiranjeevi Violation Case