Home జాతీయ వార్తలు కోడి పందేలకు హైకోర్టు బ్రేక్

కోడి పందేలకు హైకోర్టు బ్రేక్

High-Court

హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎపి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎపి సిఎస్, డిజిపిలకు నోటీసులు జారీ చేసింది. అధికారులకు నోటీసులు ఇస్తే సరిపోదని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు సూచించింది. కోడి పందేలకు ప్రభుత్వం వత్తాసు పలకవద్దని, కోడి పందేల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎపి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

High Court Comments on Hen Competitions