Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై సస్పెన్షన్ ఎత్తివేత

Komatireddy

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన ఎంఎల్‌ఎ సభ్యత్వ రద్దును మంగళవారం కోర్టు ఎత్తివేసింది. వారి ఎంఎల్‌ఎ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారు తప్పుచేసి ఉంటే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని, వారి అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేయడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించివేశారు. ఈ సమయంలో ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్‌ఫోన్ విసరారు. అది శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్వామిగౌడ్ సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేశారు. వారి ఎంఎల్‌ఎ సభ్యత్వాలు రద్దు అయినట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడంపై కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి పిటిషన్‌పై పలుమార్లు వాదనలు జరిగాయి. వాదనలు విన్న అనంతరం కోర్టు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులన్నీ రద్దయినట్లేనని కాంగ్రెస్ సభ్యుల తరపు న్యాయవాది తెలిపారు.

High Court Gave Judgment in Favor of Congress MLAs

Comments

comments