Home తాజా వార్తలు కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

High Court,New Secretariat హైదరాబాద్: తెలంగాణ కొత్త సెక్రటేరియేట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. బైసన్ పోలో గ్రౌండ్స్ లో నూతన సచివాలయాన్ని నిర్మించాలని సిఎం కెసిఆర్ భావించిన సంగతి తెలిసిందే. ఈ మైదానంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున భూమి బదలాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు జాప్యం చేసింది. తాజాగా మంగళవారం బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఈ స్థలంపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే బైసన్ పోలో గ్రౌండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ… కేంద్రం ఉత్తర్వులు వెలువరుస్తుందని, ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
High Court Green Signal To New Secretariat in Telangana